L
iLyricsLab Movie Songs
Poster for Gokulamlo Seetha

Gokula Krishna గోకుల

Movie: Gokulamlo Seetha

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Sirivennela Seetharama Sastry

Advertisement

Remove Ads

Telugu

ఘల్లు ఘల్లుమని మువ్వా సవ్వడుల ముద్దు బాలుడేవారే వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే ఆ ఆ ఆఆ ఆ ఆ

గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతొ పలుచన కాకయ్యా నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

ఏ నోటా విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా ఆ ఆ ఊరంతా చేరి ఏమేమి అన్నా కల్లబొల్లి మాటలే నా రాధికా

చెలువలు చీరలు దోచినా చిన్నెలు చాలవా ద్రోపది మానము కాచినా మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

దినాన దినాన దిననాన దీన దీన దిన దిననాన దినాన దినాన దిననాన దీన దీన దిన దిననాన దినాన దినాన దినాన దీనానా

ఆవుల్ని కాచిన ఆటల్లో తేలినా అంతతోనే ఆగేనా ఆ బాలుడు ఆ ఆ ఆ అవతార మూర్తిగా తన మహిమ చాటేగా లోకాల పాలుడు గోపాలుడు

తియ్యని మత్తున ముంచిన మురళీ లోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కథ తరములు నిలిచే కదా తలిచిన వారి ఎద తరగని మధుర సుధా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా అందేలా సందడితో గుండెలు మురిసేనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసేనురా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

English

Ghallu Ghallumanu Muvva Savvadula Muddhu Baaludevare Venna Kollagonu Krishna Paadhamula Aanavaalu Kanare Aa Aa AaAa Aa Aa

Gokula Krishna Gopala Krishna Maayalu Chaalayyaa Maa Kannulalo Dheepaalu Velige Panduga Thevayyaa Padhuguri Nindhalatho Paluchana Kaakayyaa Niluvani Adugulatho Parugulu Chaalayyaa Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare

Gokula Krishna Gopala Krishna Maayalu Chaalayyaa Maa Kannulalo Dheepaalu Velige Panduga Thevayyaa

Ye Nota Vinnaa Nee Vaarthalenaa Konte Cheshtalelaraa Konangilaa Aa Aa Oorantha Cheri Ememi Annaa Kallabolli Maatale Naa Radhika

Cheluvalu Cheeralu Dhochinaa Chinnelu Chaalavaa Dhrowpadi Maanamu Kaachinaa Manchini Choodavaa Theliyani Leelalatho Thikamaka Cheyakayaa Manasunu Choodakane Maatalu Visarakalaa Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare

Gokula Krishna Gopala Krishna Maayalu Chaalayyaa Maa Kannulalo Dheepaalu Velige Panduga Thevayyaa

Dhinanaa Dhinanaa Dhinanaana Dheena Dheena Dhina Dhinanaana Dhinanaa Dhinanaa Dhinanaana Dheena Dheena Dhina Dhinanaana Dhinaanaa Dhinaanaa Dhinaana Dheenanaa

Aavulni Kaachinaa Aatallo Thelinaa Anthanthone Aagenaa Aa Baaludu Aa Aa Aa Avathaara Moorthigaa Thana Mahima Chaategaa Lokala Paaludu Gopaaludu

Thiyyani Matthuna Munchina Muralee Loludu Maayani Dhooramu Chesina Geethaachaaryudu Kanukane Athani Kadhaa Tharammulu Neleche Kada Thalichina Vaari Yedha Tharagani Madhura Sudha Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare

Gokula Krishna Gopala Krishna Aatalu Chaalayyaa Allari Kannaa Oo Neelavrnaa Leelalu Maanayyaa Andhela Sandhaditho Gundelu Murisenuraa Navvula Rangulatho Mungili Merisenuraa Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare

Advertisement

Remove Ads