Naaloni Nuvvu Neeloni Nenu నాలోని
Movie: Needi Naadi Oke Katha
Singer: Sony,Naani
Lyricist: srinivas
Advertisement
Remove AdsTelugu
నాలోని నువ్వు నీలోని నేను నవ్వేటి కన్నుల్లో కలలైనామూ కథలైనామూ
ఊగే ఈ గాలి పూసే ఆ తోట మనమంతా నేడు ఒకటైనామూ ఒకటైనామూ
ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు నినునన్ను కలిపేటి నీలాల సిరులు ఆ చేదు కాలం మారింది నేడు చెరసాల బాధ పోతుంది చూడు
పొడిసే పొద్దు ఎగసే ఆనందం శాశ్వత హోమం కాదిక నా దేహం చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు
నాలోని నువ్వు నీలోని నేను మోసేటి నేలకు కనులైనామూ కనులైనామూ
హా హా హా హా హా హా హా
నీటిలొ ఈదే చేపకు ఎపుడైనా దాహం వేస్తుందా తెలుసా నీకైనా నింగిలొ ఎగిరే కొంగకు ఎపుడైనా మలినం అంటేనా తెలుసా నీకైనా
లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా శోకం ఎంతున్నా కాలం ఆగేనా ఎవరూ ఏమన్నా ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా
పలికే ఆ చిలుక నవ్వే నెలవంక ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక ఏలే భువనాన గెలిచిన జత మాది మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా
నాలోని నువ్వు నీలోని నేను మోసేటి నేలకు కనులైనామూ
English
Naaloni Nuvvu Neeloni Nenu Navveti Kannullo Kalalainamu Kathalainamu
Uuge Gaali Poose Aa Thota Manamanta Nedu Okatainamu Okatainamu
Aa Seetakokalu Ee Manchu Konalu Ninu Nannu Kalipeti Neelaala Sirulu Aa Chedhu Kaalam Maarindi Nedu Cherasala Badha Pothundhi Chudu
Podise Aa Poddhu Yegase Aanandam Shaswatha Homam Kaadika Naa Deeham Cheliyaa Naa Upiri Vachenuga Thirigi Pakshula Gontullo Patanu Nenipudu
Naaloni Nuvvu Neeloni Nenu Moseti Nelaku Kanulainamu Kanulainamu
Neetilo Ede Chepaku Yepudaina Daham Vesthunda Telusaa Neekaina Ningilo Egire Kongaku Yepudaina Malinam Antena Telusaa Neekaina
Loyalu Ennunna Lokam Emanna Sokam Enthunna Kaalam Aagena Evaru Emanna Ye Thodu Lekunna Needai Nenuntaa
Palike Aa Chilukaa Navve Nelavanka Egire Pichukala Sweche Naadinka Yele Bhuvananaa Gelichina Jatha Maadi Maala Memunte Brathuke Muddantaa
Naaloni Nuvvu Neeloni Nenu Moseti Nelaku Kanulainamu
Advertisement
Remove Ads